News April 8, 2025

మద్యం మత్తులో హత్య: సీఐ

image

రావికమతం మండలం గర్ణికంలోని ఆదివారం రాత్రి పవన్ కుమార్ <<16017545>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. యువకుడి హత్యకు స్నేహితుల మధ్య మద్యం మత్తులో తలెత్తిన వివాదం కారణం కావొచ్చని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వరరావు తెలిపారు. అతనితో కలిసి మద్యం తాగిన స్నేహితుల వివరాలు, హత్యకు దారి తీసిన వివాదంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. పవన్‌కు గతంలో నేర చరిత్ర ఉందన్నారు.

Similar News

News April 19, 2025

ఖమ్మం: బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

image

బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మండలం మేడిదపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 19, 2025

HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

image

కూకట్‌పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.

News April 19, 2025

కొత్తగూడెం: ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు

image

భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామంలో శుక్రవారం విషాదం నెలకొంది. అక్రమ మట్టితవ్వాకాలు నిర్వహిస్తున్న ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల చిన్నారి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెప్పారు. చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించినట్లు సమాచారం.

error: Content is protected !!