News April 15, 2024

మధుయాష్కి గౌడ్‌కు మాతృవియోగం

image

టీపీసీసీ ప్రచారకమిటీ ఛైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ (86) కన్నుమూశారు. వయసుసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని మధ్యాహ్నం ఓల్డ్ హయత్ నగర్లోని మధుయాష్కి స్వగృహానికి తీసుకురానున్నారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 9, 2025

NZB: రైల్వే స్టేషన్ ప్రాంతంలో వృద్ధుడు మృతి

image

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు SHO రఘుపతి బుధవారం తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా దర్గా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

News January 9, 2025

నిజామాబాద్: అరకిలో గంజాయి పట్టివేత

image

నిజామాబాద్ వినాయక నగర్ అమరవీరుల స్థూపం సమీపంలో బుధవారం గంజాయి ప్యాకెట్లను 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది దాడులు నిర్వహించి అరకిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News January 9, 2025

NZB: మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో కురగాయల వ్యాపారుల ఆందోళన

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఎదుట కూరగాయల వ్యాపారాలు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక అంగడి బజార్‌లో తమను రోడ్ల మీద నుంచి తొలగించి డీఎస్ కాంప్లెక్స్‌లోకి తరలించడం కూరగాయల వ్యాపారులు గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రోజువారీ వ్యాపారాలు దెబ్బతింటాయని MIM నేతలు జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.