News March 4, 2025

మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. డీఆర్డీఏ పరిధిలోని సమస్యలు గుర్తించి.. వాటిని పరిష్కరించేలా అడుగులు వేయాలన్నారు.  

Similar News

News March 5, 2025

పెంచికల్పేట్: అనుమానంతోనే హత్య చేశాడు: CI

image

లోడుపల్లికి చెందిన గుర్లే లలిత పంట చేనులో హత్య విషయం తెలిసిందే. CI శ్రీనివాసరావు, SI కొమురయ్య కథనం ప్రకారం.. భర్త గణేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆదివారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. పథకం ప్రకారం మామిడి తోటలో ఆమెను తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులకు ఎదుట అంగీకరించాడు.

News March 5, 2025

ట్రంప్‌తో వాగ్వాదం తీవ్ర విచారకరం: జెలెన్‌స్కీ

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తీవ్ర విచారకరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చాత్తాపపడ్డారు. ట్రంప్ నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు. ‘రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు మేం సిద్ధం. ఇందుకోసం USతో కలిసి పనిచేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం. ఇప్పటివరకు US అందించిన సాయాన్ని ఎంతగానో గౌరవిస్తున్నాం. అగ్రరాజ్యానికి ఉక్రెయిన్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News March 5, 2025

మెదక్: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

image

మెదక్ జిల్లా నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్మట్ పల్లి- చిల్వర్ మధ్యలో హైవే బ్రిడ్జిపై రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అల్లాదుర్గంకు చెందిన బండ సాయిలు (55), మణెమ్మగా గుర్తించారు. బొడ్మట్ పల్లి సంతలో కూరగాయలు అమ్మి ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది.

error: Content is protected !!