News April 5, 2025

మ‌రింత మెరుగ్గా అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌: క‌లెక్ట‌ర్

image

జిల్లాలోని మూడు అన్న క్యాంటీన్ల‌కు రాష్ట్ర‌స్థాయిలో మెరుగైన ర్యాంకులు ల‌భించ‌డం ప‌ట్ల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ శుక్రవారం అభినందించారు. వీటి నిర్వ‌హ‌ణ‌ను మ‌రింతగా మెరుగుప‌రిచి, ప్ర‌జ‌ల‌కు రుచిక‌రంగా, నాణ్య‌మైన భోజ‌నాన్ని, అల్పాహారాన్ని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. జిల్లాలోని అన్ని అన్న‌ క్యాంటీన్లు ఈ ఘనత సాధించాలని ఆకాంక్షించారు.

Similar News

News April 8, 2025

వ్యవసాయ అనుబంధ రంగాల గ్రోత్ రేట్ పెరగాలి: కలెక్టర్

image

వ్యవసాయ అనుబంధ రంగాల్లో 12.97 శాతం ఉన్న వృద్ధి రేటును ఈ ఏడాదిలో 16.32 శాతానికి పెంచాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ అనుబంధ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయంలో ఎటువంటి చర్యలు చేపట్టాలో వ్యవసాయాధికారులు మండల వారీగా కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించి పంపాలన్నారు.

News April 7, 2025

ఫోర్బ్స్ జాబితాలో GMR

image

ఫోర్బ్స్ 2025 ప్రపంచ కుబేరుల జాబితాలో రాజాంకు చెందిన గ్రంథి మల్లిఖార్జునరావు 1,219 స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో సంపన్న వ్యక్తి ఆయనే. ఏప్రిల్ 2 నాటికి ఆయన నికర సంపద 3.0 బిలియన్ డాలర్లు కాగా.. తన స్వగ్రామమైన రాజాంలో నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. రాజాంలో విద్యాసంస్థలు, ఆసుపత్రి నిర్మించారు. ఎయిర్ పోర్టును GMR సంస్థనే నిర్మిస్తుంది.

News April 7, 2025

వినతులు స్వీకరించనున్న మంత్రి కొండపల్లి

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వినతులు స్వీకరించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాకు చెందిన ప్రజలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను విడతల వారీగా పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!