News April 25, 2025

మరిపెడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని పూల బజార్‌కు చెందిన వంశీ(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కాలువ ఒడ్డు ప్రాంతంలో బైక్, ఆటో ఢీ కొనడంతో వంశీ మృతి చెందాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. శుక్రవారం ఉదయం మరిపెడలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Similar News

News April 25, 2025

చీరాల ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ!

image

ఉమ్మడి ప్రకాశం(D)లో రాజకీయంగా కీలక స్థానమైన చీరాలలో పాలిటిక్స్ వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, సూరగాని లక్ష్మి తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది.

News April 25, 2025

అల్లూరి: సమస్య తీవ్రతకు అద్దం పట్టే ఫొటో

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో తాగునీటి కష్టాలకు అద్దం పడుతోంది ఈ ఫొటో. అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ పరిధి తట్టావలసలో చేతిపంపు నుంచి పనిచేయకపోవడంతో తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో ఊటనీటిని తెచ్చుకొని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం మంచినీటి కోసం చంటి బిడ్డతో వెళ్తున్న కుటుంబాన్ని ఈ ఫొటోలో చూడొచ్చు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు.

News April 25, 2025

మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు: DIEO

image

ఇంటర్ ఫెయిలైన, ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి దస్రూ నాయక్ తెలిపారు. రోజూ 2 పూటల పరీక్ష ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. అయితే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.

error: Content is protected !!