News March 25, 2024

మరో రికార్డుకు చేరువలో విశాఖ పోర్టు

image

విశాఖ పోర్టు 90 ఏళ్ల చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 72.01 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా చేసిన పోర్టు.. ఈ ఆర్థిక సంవత్సరం 2023–24 ముగియకుండానే పోర్టు 79 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును రవాణా చేసింది. సరుకు హ్యాండ్లింగ్‌లో కూడా గత ఏడాదితో పోల్చితే సోమవారంతో 73,52,899 టన్నులు అధికంగా హ్యాండ్లింగ్‌ చేసింది.

Similar News

News February 7, 2025

విశాఖ బీచ్ రోడ్డులో మురీ మిక్చర్ తింటున్నారా?

image

విశాఖ బీచ్ రోడ్డులో మురీ మిక్చర్‌ తీనేవారికి చేదువార్త. న్యూస్ పేపర్‌లో మురీమిక్చర్ తింటే క్యాన్సర్ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి.ఏ.బి నందాజీ తెలిపారు. ఈ మేరకు మురీ మిక్చర్ అమ్మె చిరు వ్యాపారులకు గురువారం అవగాహక కల్పించారు. ప్రింటింగ్ న్యూస్ పేపర్లో అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలని వారికి సూచించారు. ఎఫ్ఎస్ఐ మార్కు ఉన్న పేపర్‌ప్లేట్లు వినియోగించాలన్నారు.

News February 7, 2025

కేజీహెచ్‌లో బాలిక ప్రసవం

image

కేజీహెచ్‌లో 17 ఏళ్ల బాలిక ప్రసవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలిక భీమిలిలోని ఓ హాస్టల్‌లో చదువుతోంది. కడుపునొప్పి రావడంతో కేజీహెచ్‌లో చేర్పించగా నెలలు నిండని మగబిడ్డ పుట్టి.. చనిపోయినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు విచారణ చేస్తున్నారు. ఓ యువకుడు పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరైనట్లు గుర్తించారు.

News February 7, 2025

ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ఠ చ‌ర్య‌లు: కలెక్టర్

image

ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు రెవెన్యూ అధికారులు ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టాలని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో భీమిలి డివిజ‌న్ రెవెన్యూ అధికారులతో కాన్ఫెరెన్స్‌లో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. అన్యాక్రాంతానికి గురైన భూముల‌ను గుర్తించి త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

error: Content is protected !!