News March 31, 2025
మల్కాజ్గిరి: ‘పిచ్చుకలు రక్షించాలంటూ సెలబ్రేషన్స్’

రోజురోజుకు పిచ్చుకల చప్పుడు కనుమరుగైపోతుంది. దీనిని గుర్తించిన మల్కాజిగిరి స్పారో బృందం, దావూదీ భరోసా కేంద్రం సభ్యులందరూ కలిసి ప్రత్యేక సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ గ్రామాలకు వెళ్లి సైతం అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు డా.సువర్ణ ప్రకాష్ సింగ్ తెలిపారు. పర్యావరణంపై ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా జీవరాశుల పట్ల వ్యవహరించాలని కోరారు.
Similar News
News April 5, 2025
బొండపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్.. ఏడుగురి అరెస్ట్

మండల కేంద్రమైన బొండపల్లిలో ఆన్‌లైన్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై యు.మహేశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 5, 2025
RGM: కానిస్టేబుల్ నుంచి పంచాయతీరాజ్ AE

రామగుండం NTPCపోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తూర్పాటి సాయిలత పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో AEగా ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తున్న సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో SIలు ఉదయ్ కిరణ్, మానస పోలీసు సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. గతేడాది కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిలత అనతి కాలంలో AEగా ఉద్యోగ సాధించడం పట్ల అభినందించారు.
News April 5, 2025
కొమరోలు: భర్తపై యాసిడ్ పోసిన భార్య

గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు (మం) బాదినేనిపల్లెకి చెందిన ప్రసన్న, నాగార్జున ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ రాజంపేటలోని బోయినపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా మార్చి 23వ తేదీన నాగార్జునకు ప్రసన్న మత్తు మందు ఇచ్చి అతనిపై యాసిడ్ పోసి పరారైంది. కుటుంబ సభ్యులు నాగార్జునను తిరుపతి, కడప, కర్నూల్ వైద్యశాలలో చికిత్స ఇప్పించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.