News February 28, 2025

మల్దకల్: అమ్మా, నాన్న లేక అనాథలయ్యారు!

image

మల్దకల్ మండలం చర్లగార్లపాడులో అనారోగ్యంతో తల్లి, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి మృతి చెందగా ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కుమ్మరి వీరేశ్, భారతి కుండలు చేస్తూ జీవిస్తున్నారు. భారతి జనవరి 16న అనారోగ్యంతో మృతి చెందింది. భార్య లేని లోటు, ఆర్థిక ఇబ్బందులతో వీరేశ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు అంటున్నారు.

Similar News

News March 1, 2025

వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

image

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.

News March 1, 2025

గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ

image

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రాక్టీస్‌లో ఎలాంటి తడబాటు లేకుండా ఏకంగా 95 మీటర్లకు పైగా సిక్సర్ బాదినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎల్లుండి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఆడరనే ప్రచారానికి తెరదించినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచుకు రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News March 1, 2025

నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. ✓వెల్దండ మండలం గుండాలలో కోనేరులో గల్లంతైన ఓమేష్ మృతదేహం లభ్యం.✓నాగర్ కర్నూలు జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.✓కొల్లాపూర్ లోని సింగోటంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత.✓జిల్లాలో..నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓బల్మూరు మండలంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ.

error: Content is protected !!