News February 22, 2025
మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.
Similar News
News February 23, 2025
NGKL: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు.!

మహాశివరాత్రి సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మొత్తం 58 బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులను శివ స్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 23, 2025
కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

AP: వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన <<15497715>>కొత్త రేషన్ కార్డులు<<>> అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగంలో మాట్లాడుతూ పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఇక రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.
News February 23, 2025
తునిలో చిన్నారిపై అత్యాచారయత్నం

తుని పట్టణంలో శనివారం దారుణం జరిగింది. పట్టణానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ రోజూలాగే పనులకు వెళ్లారు. ఆ దంపతులకు చెందిన ఐదేళ్ల చిన్నారిని స్థానికంగా ఉండే ఓ యువకుడు కేక్ కొనిస్తానని చెప్పి చిన్నారిపై అత్యాచారానికి యత్నించినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేసినట్లు వివరించారు.