News April 24, 2024

మల్లన్నను దర్శించుకున్న నారా చంద్రబాబు దంపతులు

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా సోమవారం శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News December 13, 2025

లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం

image

జాతీయ లోక్‌అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 13, 2025

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జోహార్ నవోదయ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఆరో తరగతి ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,469 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 4,548 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు.

News December 13, 2025

కర్నూలు: ఆటో కొనివ్వలేదని సూసైడ్

image

నంద్యాల(D) బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రామాంజనేయులు(30) ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈయన.. కొంతకాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లలేదు. ఆటో నడుపుతానని, కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. మద్యం మానితే కొనిస్తామని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 2న కల్లూరు(M) పందిపాడు సమీపంలో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు నమోదైంది.