News March 31, 2024
మల్లాపూర్: ఉరేసుకుని వ్యక్తి మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నల్లూరి గంగాధర్(34) కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఈరోజు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News April 22, 2025
కరీంనగర్: ఓపెన్ పదో, ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

కరీంనగర్ జిల్లాలో సోమవారం ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు తెలిపారు. పదో తరగితి పరీక్షకు 3 పరీక్షా కేంద్రాల్లో 410 మందికి 375 మంది, ఇంటర్ పరీక్షకు 4 పరీక్షా కేంద్రాల్లో 908 మందికి 839 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 టెన్త్ పరీక్ష కేంద్రాలో మొత్తం 62 మందికి 52 మంది హాజరైనట్లు పరీక్ష ఓపన్ స్కూల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు.
News April 22, 2025
KNR: పప్పు ధాన్యాల సాగుపై రైతుల అనాసక్తి!

ఉమ్మడి KNR జిల్లాలో పప్పు ధాన్యాల సాగు తగ్గిపోతుంది. మినప, పెసర, కంది, పల్లి, ఇతర పంటలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. వేలాది ఎకరాల్లో సాగయ్యే పప్పు ధాన్యాల పంట నేడు గణనీయంగా తగ్గిపోయింది. యాసంగి సాగు తరువాత మినప, పెసర పంటలు వేయడం వల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు ఆదాయం కూడా వస్తుంది. అధికారులు చర్యలు తీసుకోని రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే ఈ పంటలు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
News April 22, 2025
గుంపుల- తనుగుల వంతెన పై రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

ఓదెల(M) గుంపుల, జమ్మికుంట(M) తనుగుల మధ్య ఉన్న వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. JMKT(M) వావిలాలకు చెందిన నెల్లి వంశీ(25)కి ఓదెల(M) గూడెంకు చెందిన అర్చితతో ఇటీవల వివాహమైంది. కళ్యాణ లక్ష్మి పత్రాలపై సంతకం చేసేందుకు ఉదయం గూడెం గ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో గుంపుల వంతెన పై ఎదురుగా వస్తున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. వంశీ మృతి చెందగా అర్చిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.