News April 5, 2024
మల్లాపూర్: ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యుల దాడి
మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సాతారానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన రమ్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకొని వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. గురువారం గ్రామానికి తిరిగి రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంట్లోకి చొరబడి దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 26, 2024
KNR: ఆన్లైన్ మోసాలకు బలవుతున్న అమాయకులు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆన్లైన్ మోసాలకు అమాయకులు బలవుతున్నారు. బెట్టింగ్, ఇన్వెస్ట్మెంట్, గేమింగ్ లాంటి మోసపూరితమైన ప్రకటన చూసి అందులో అధిక డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో మొబైల్లో వచ్చిన లింకులను ఓపెన్ చేసి అందులో డబ్బులు పెడుతున్నారు. చివరకు మోసపోయామని తెలిసి మిగతా జీవులుగా మారుతున్నారు. మొబైల్లో వచ్చే లింకులు, యాప్ లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News December 26, 2024
హుస్నాబాద్: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు
హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, నాయకులు లింగమూర్తి, సత్యనారాయణ గౌడ్ తదితరులున్నారు.
News December 26, 2024
రాహుల్ గాంధీకి ధన్యవాదాలు: మంత్రి పొన్నం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం (ఎక్స్) ద్వారా స్పందించారు. తెలంగాణ ప్రగతిని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. మీ మార్గదర్శకత్వం మాకు స్ఫూర్తినిస్తుంది అని ట్వీట్ చేశారు.