News October 24, 2024
మళ్లీ వర్షాలు.. జాగ్రత్త: అనంతపురం జిల్లా కలెక్టర్
రెండ్రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రెండు రోజులు మళ్లీ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలాశయాల వద్దకు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. హగరి, చిత్రావతి, పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉందన్నారు.
Similar News
News January 3, 2025
శ్రీ సత్యసాయి: పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో ఎనుము పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News January 3, 2025
పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించండి: కలెక్టర్
దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ తెలిపారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.
News January 2, 2025
శ్రీ సత్యసాయి కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌ను ఎస్పీ రత్న గురువారం కలిశారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలు గురించి చర్చించారు.