News April 24, 2024

మళ్ళీ తగ్గిన మిర్చి ధర..ఎంతంటే!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,700 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.300 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

Similar News

News April 23, 2025

KMM: ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందొద్దు: DEO

image

జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయని, కేవలం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DEO సోమశేఖర్ వర్మ అన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 23 నుంచి 30 వరకు పరీక్ష ఫీజును పట్టించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఫెయిల్ అయ్యామని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక పరిస్థితిని గమనించి సరైన సూచనలు ఇవ్వాలని కోరారు.

News April 22, 2025

ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి ప్రతిభ

image

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సెకండియర్‌లో హాసిని 994, ప్రియాంబిక 993, సంతోశ్ 991, జ్యోత్స్న 994, నవ్యశ్రీ 988, ఫస్టియర్‌లో భువనకృతి 468, పవిత్ర 468, హర్షిత్ 467, ప్రహర్ష 437, కరుణశ్రీ 437 ఉత్తమ రిజల్ట్ సాధించారని డైరెక్టర్ జగదీశ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల తోడ్పాటుతోనే ఈ ఫలితాలు సాధించగలిగామని డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు తెలిపారు.

News April 22, 2025

ఖమ్మం: ఇంటర్ రిజల్ట్స్.. విద్యార్థి అదృశ్యం.!

image

ఇంటర్మీడియట్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థి అదృశ్యమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. సుజాతనగర్ మండలానికి చెందిన సుశాంత్ ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఫలితాల అనంతరం సుశాంత్ కనబడటం లేదని తల్లిదండ్రులు తెలిపారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!