News March 23, 2024
మహబూబాబాద్ DRDO పురుషోత్తం సస్పెండ్

మహబూబాబాద్ DRDOగా పని చేస్తున్న పురుషోత్తంపై సస్పెన్షన్ వేటు పడింది. భూపాలపల్లిలో డీఆర్డీఏ పీడీగా కొనసాగిన సమయంలో రికార్డులను అందజేయకపోవడంపై సమగ్రమైన విచారణ అనంతరం పురుషోత్తం సస్పెండ్ అయ్యారు. డీఆర్డీవోను బాధ్యతల నుంచి తప్పించాలని పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.
News April 20, 2025
ఆనాటి నెమలి కొండే.. నేటి నెక్కొండ..!

ఆనాటి నెమలి కొండే.. ఇప్పటి నెక్కొండ. మండల పరిధిలో 19 గ్రామాలు ఉన్నాయి. నర్సంపేట డివిజన్ రెవెన్యూ పరిధిలో ఉన్న ఏకైక రైల్వేస్టేషన్ నెక్కొండ. పత్తి, మిరప, మొక్కజొన్న, వరి ప్రధాన పంటలుగా ఉన్నాయి. భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరిపి పేదలకు పెద్ద ఎత్తున భూములు పంచిన చరిత్ర నెక్కొండది. సంక్రాంతి పర్వదినాన నెక్కొండ శివారులో జరిగే చెన్నకేశవస్వామి జాతర ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
News April 20, 2025
పంట పొలాలు, చారిత్రక ఆనవాళ్లు.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత

18 గ్రామాలతో తనదైన అస్తిత్వం, చుట్టూ గ్రామీణ వాతావరణం, చారిత్రక ఆనవాళ్లు, కరవుకు ఎంతో దూరం.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత. నగరానికి కూరగాయలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా దుగ్గొండి మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఎన్నో రోగాలకు దివ్య ఔషధమైన తాటికళ్లును అందించే ప్రాంతంగా దుగ్గొండి గుర్తింపు పొందింది. మండల పరిధి కేశవాపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.