News March 13, 2025
మహబూబాబాద్: ఆవు ఢీకొని వ్యక్తి మృతి

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్ తండా వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ నుంచి బైక్‌పై వెళ్తున్న సంపత్ అనే వ్యక్తిని రోడ్డుపై ఆవు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కురవి మండలం సుధనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.
Similar News
News March 13, 2025
హోలీని నిషేధించిన మమతా సర్కారు.. BJP ఫైర్

బెంగాల్ బీర్‌భూమ్ జిల్లా శాంతినికేతన్లో హోలీ వేడుకలను మమతా బెనర్జీ సర్కారు నిషేధించడం వివాదాస్పదంగా మారింది. ఇది యునెస్కో వారసత్వ సంపదని, రంగులు చల్లుకుంటే వృక్ష సంపదకు నష్టమని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఫారిన్ టూరిస్టులు వస్తారు కాబట్టి పండగ జరుపుకోవద్దని బ్యానర్లు కట్టించారు. FRI రంజాన్ ప్రార్థనలు ఉంటాయి కాబ్టటి 10AM లోపే రంగులు చల్లుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై BJP ఆందోళన చేస్తోంది.
News March 13, 2025
హోలీ పండుగ.. వరంగల్ సిటీలో పోలీసుల నజర్

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. హోలీ వేళ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారితో పాటు.. మహిళలు, యువతులపై వారి అనుమతి లేకుండా రంగులు జల్లే వారిపై పోలీసులు నజర్ పెట్టాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News March 13, 2025
రిషభ్ పంత్ చెల్లెలి పెళ్లి.. PHOTO

భారత క్రికెటర్ రిషభ్ పంత్ చెల్లెలి వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్సోరిలోని లగ్జరీ హోటల్లో సాక్షి, లండన్ వ్యాపారవేత్త అంకిత్ చౌదరి పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకకు ధోనీ, రైనా, పృథ్వీ షా, నితీశ్ రాణా, పలువురు నటులు హాజరయ్యారు.