News March 1, 2025
మహబూబాబాద్: ఎగ్ పఫ్ తింటున్నారా.. జర జాగ్రత్త..!

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ ఫిర్యాదు మేరకు బ్రహ్మ లింగేశ్వర బేకరీని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బేకరీలో ఎగ్ పఫ్‌లో అధికంగా ప్లాస్టిక్ ఉందని దేవేందర్ ఫిర్యాదు చేయగా అధికారి తనిఖీలు చేసి నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Similar News
News March 1, 2025
భద్రాద్రి: ఇద్దరు యవకులు మృతి.. అక్కా చెల్లెళ్లకు కడుపుకోత!

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు <<15610313>>గల్లంతయి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్(20) గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. సీఐ రమేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2025
చౌటుప్పల్: హత్య కేసులో జీవిత ఖైదు

హత్య కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ భువనగిరి జిల్లా కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. వివరాలిలా.. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలిని బంగారం కోసం అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు(46) 2022లో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో జీవత ఖైదు, రూ.20 వేల జరిమానా విధించారు.
News March 1, 2025
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

MBNR, WNP, NGKL జిల్లాల్లో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. జడ్చర్లకు చెందిన వడ్డె సంజీవ(30) అప్పులు తీర్చలేక ఉరేసుకున్నాడు. గోపాల్‌పేటకు చెందిన కొంకలి మల్లయ్య(40) కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. NGKL జిల్లా పెనిమిళ్లకి చెందిన మేర కృష్ణయ్య సోదరి దగ్గర ఉంటుండగా, కడుపునొప్పి భరించలేక పొలం వద్ద ఉరేసుకున్నాడు.