News March 10, 2025

మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సమచిత స్థానం

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఖరారు చేసినందుకు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News March 10, 2025

బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

image

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

News March 10, 2025

శ్రీదేవి చివరి సినిమాకు సీక్వెల్.. హీరోయిన్ ఎవరంటే?

image

శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘MOM’కు సీక్వెల్ తీయబోతున్నట్లు ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఇందులో తమ రెండో కూతురు ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపిస్తారని పేర్కొన్నారు. ‘ఖుషీ తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. నటించిన అన్ని భాషల్లో శ్రీదేవి టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. జాన్వీ, ఖుషీ కపూర్ కూడా ఆ స్థాయిలో సక్సెస్ అవుతారని నమ్ముతున్నా’ అని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు.

News March 10, 2025

జడేజా భార్యపై ప్రశంసలు!

image

న్యూజిలాండ్‌ను టీమ్ఇండియా ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం జట్టుతో కుటుంబసభ్యులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. నెట్టింట ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

error: Content is protected !!