News February 1, 2025

మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. మండలస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.

Similar News

News February 2, 2025

సంగారెడ్డి: ముగిసిన బడి బయట పిల్లల సర్వే

image

సంగారెడ్డి జిల్లాలో జనవరి 11 నుంచి సీఆర్పీలు, ఐఈఆర్పీలు నిర్వహించిన బడి బయట పిల్లల సర్వే శనివారంతో ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బడి బయట పిల్లల సర్వేలో గుర్తించిన పిల్లల వివరాలను ప్రభంధ పోర్టల్ వెబ్సైట్‌లో నమోదు చేయాలని సీఆర్పీలకు, ఐఈఆర్పీలకు సూచించారు.

News February 2, 2025

జీవవైవిధ్య పరిరక్షణలో చిత్తడినేలల పాత్ర అద్వితీయం: మంత్రి సురేఖ

image

జీవ వైవిధ్య పరిరక్షణలో చిత్తడి నేలల పాత్ర అద్వితీయమైనదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఫిబ్రవరి 2న చిత్తడినేలల (వెట్ ల్యాండ్స్) పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి తన భావాలను పంచుకున్నారు. చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్నాయన్నారు. కాలుష్య తీవ్రత కారణంగా పర్యావరణ అసమతుల్యతతో తలెత్తే దుష్ప్రభావాలను అరికట్టడంలో, నీటినాణ్యతను పెంచడంలో చిత్తడి నేలలు వడపోత వ్యవస్థగా పనిచేస్తాయన్నారు.

News February 2, 2025

ASF: 57 మంది బాలకార్మికులకు విముక్తి : SP

image

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ -XI సఫలమైనట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 57 మంది బాలకార్మికులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.