News March 18, 2025

మహబూబాబాద్‌: నిలిచిన పలు రైళ్లు..!

image

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News March 19, 2025

అచ్చంపేట: అర్హత లేని ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు

image

అచ్చంపేట పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రిలో ఎలాంటి అర్హత లేని ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తుండగా వారిపై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు. సాయి క్లినిక్‌లో నరేందర్, కావేరి పాళీ క్లినిక్‌లో లింగాచారి ఎంబీబీఎస్ అర్హత లేకుండా రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు.

News March 19, 2025

నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నేపథ్యం ఇదే..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వేముల నరేందర్ రావును అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఉప్పునుంతల మండలం పెద్దాపూర్‌కు చెందిన నరేందర్ విద్యార్థి దశ నుంచి నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూనే పార్టీలో కార్యకర్తగా చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు.

News March 19, 2025

మెదక్: ఈ నెల 31 చివరి అవకాశం: కలెక్టర్

image

అనధికార లే అవుట్ ప్లాట్లు, లే అవుట్‌లను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఈనెల 31లోగా క్రమబద్ధీకరించి రుసుము చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మునిసిపల్ కార్యాలయలో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 22 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయన్నారు.

error: Content is protected !!