News February 12, 2025
మహబూబాబాద్: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739330995007_1047-normal-WIFI.webp)
మహబూబాబాద్ జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.
Similar News
News February 12, 2025
అదరగొడుతున్న గిల్.. కోహ్లీ ఫిఫ్టీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739352543869_1226-normal-WIFI.webp)
భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నారు. వరుసగా మూడు వన్డేల్లో 50+ స్కోర్ చేశారు. తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశారు. మూడో వన్డేలోనూ అర్ధసెంచరీతో కొనసాగుతున్నారు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న కింగ్ కోహ్లీ(52) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యారు.
News February 12, 2025
14న కడపకు మాజీ సీఎం జగన్ రాక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739352304182_52218543-normal-WIFI.webp)
ఈనెల 14న కడప నగరానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహానికి జగన్ హాజరవుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి కడపకు చేరుకొని వివాహ వేడుకల్లో పాల్గొని అనంతరం జగన్ నేరుగా బెంగళూరుకు వెళ్తారని పార్టీ నాయకులు వెల్లడించారు.
News February 12, 2025
శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350313921_1212-normal-WIFI.webp)
శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.