News April 1, 2025

మహబూబ్‌నగర్: ఇటుక బట్టీలో ఛిద్రమవుతోన్న బాల్యం..!

image

మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని కోడూరు గ్రామం దగ్గర చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పలక, బలపం పట్టాల్సిన చేతులు యాజమాన్యాల కింద నలిగిపోతున్నాయి. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చిన్నారులను బడిలో ప్రవేశం కల్పించకుండా బాల కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, విద్య,శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో సంరక్షించాలని స్థానికులు కోరారు. 

Similar News

News April 3, 2025

అడ్డాకుల: అవసరాలకు డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

image

చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కి చెందిన శివ(32) కూలీపనులు చేస్తూ జీవిస్తున్నారు. అవసరానికి తల్లితో అప్పుడప్పుడు డబ్బులు తీసుకునేవాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి తల్లితో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన శివ సోలార్ గేట్ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 3, 2025

GWL: ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది!

image

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

News April 3, 2025

MBNR: 29 వేల మందికి మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం

image

మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ కింద 31,190 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు రాయితీతో అవకాశం కల్పించినా కేవలం 2వేల మంది మాత్రమే పరిష్కరించుకున్నారు. మిగిలిన 29 వేల మంది దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఏప్రిల్ నెల వరకు 25 శాతం సబ్సిడీతో పరిష్కరించుకునేలా అవకాశాన్ని పొడిగించింది. ఇకనైనా వీరు ముందుకొస్తారో లేదో వేచి చూడాల్సిందే.

error: Content is protected !!