News January 6, 2025
మహబూబ్‌నగర్: ఉరేసుకుని ఇద్దరి ఆత్మహత్య
ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు వేర్వేరు కారణాలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా.. మల్దకల్‌కు చెందిన కుమ్మరి నర్సింహులు(42) గద్వాలలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకున్నారు. వారు లోన్ చెల్లించాలని ఒత్తిడి తేవటంతో ఈ నెల 3న ఉరేసుకున్నారు. నందివడ్డెమాన్‌కి చెందిన చెన్నయ్య(45) ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
Similar News
News January 8, 2025
MBNR జిల్లా ఆసుపత్రిలో డెవలప్‌మెంట్ కమిటీ కీలక భేటీ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ డీకే అరుణ బుధవారం డెవలప్‌మెంట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రుల అప్ గ్రేడ్, ఇతర అభివృద్ధి పనుల కోసం భారీగా నిధుల మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అధికారులు పాల్గొన్నారు.
News January 8, 2025
AMAZING: తాజ్‌మహల్‌లో పాలమూరు రాళ్లు!
తాజ్‌మహల్ నిర్మాణంలో మహబూబ్‌నగర్ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్‌జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్ లైబ్రరీ& రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్‌కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్‌మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.
News January 8, 2025
MBNR: తగ్గిన ధరలు.. టమాటా రైతుల ఆందోళన
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు సీజన్లలోనూ 1,690 ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేశారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ.25-30 పలకగా.. ప్రస్తుతం రూ.10కి పడిపోయింది. పట్టణంలోని రైతుబజార్‌లో రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. పంట ఉత్పత్తి పెరగడం, రైతులంతా ఒకేసారి మార్కెట్లకు పంట దిగుబడులు తీసుకురావడంతో ధరలు పడిపోయాయని ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు.