News April 2, 2025
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త: ఎస్పీ

బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌కు దూరంగా ఉండాలని, అవి ప్రాణాలతో చెలగాటమాడుతాయని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి ఓ ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో IPL బెట్టింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Similar News
News April 4, 2025
మహబూబ్‌నగర్: ఏప్రిల్ 14లోపు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో స్పెషల్ అధికారులు, బ్యాంకర్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అర్హులకు రూ.50 వేల నుంచి రూ.నాలుగు లక్షల వరకు రుణం మంజూరు చేస్తామన్నారు. అర్హులైన వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 4, 2025
‘మహబూబ్‌నగర్ జిల్లాలో యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం’

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
News April 3, 2025
మహబూబ్‌నగర్: ‘దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు కొమురయ్య’

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.