News April 4, 2024

మహబూబ్‌నగర్: పది మూల్యాంకనం ప్రారంభం

image

టెన్త్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని గ్రామర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 11 వరకు కొనసాగనుంది. కాగా డ్యూటీ ఆర్డర్లు తీసుకున్న వారిలో తొలిరోజు సమాచారం ఇవ్వకుండానే 160 మందికి పైగా విధులకు గైర్హాజరైనట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు TA, DA ఇవ్వడం లేదని, పారితోషికం తక్కువేనని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు.. !

image

✒దౌల్తాబాద్:అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
✒ఉమ్మడి జిల్లాలో దసరా వేడుకలు షురూ
✒మెదక్ పై పాలమూరు ఘనవిజయం..ఇక సెమి ఫైనల్
✒GDWL: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
✒దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి:RS ప్రవీణ్
✒రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ
✒DSC ఫలితాలు విడుదల..1:3 పై ఫోకస్
✒నల్లమలలో టైగర్ సఫారీ రెడీ.. ఇక ఆన్లైన్ బుకింగ్

News September 30, 2024

నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి: సిక్తా పట్నాయక్

image

ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట శివారులోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని, దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 30, 2024

రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ

image

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నేడు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుహామీల సాధనదీక్షలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. రైతురుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు.