News April 6, 2025
మహబూబ్‌నగర్‌లో నేడు చికెన్, మటన్ షాపులు బంద్

శ్రీరామ నవమిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం చికెన్, మటన్, చేపలు తదితర మాంసం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మున్సిపాలిటీ హెచ్చరికలను బేఖాతరు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. SHARE IT
Similar News
News April 8, 2025
MBNR: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ వివరాలు.. పురపాలక పరిధిలోని ఏనుగొండ సరస్వతి దేవి గుడి కమాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి చనిపోయి ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇతర వివరాలకు 8712659336 నంబర్‌పై సంప్రదించాలన్నారు.
News April 8, 2025
అడ్డాకుల: శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే..?

దక్షిణ కాశీగా పిలవబడే అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దేవాలయ శాఖ ఇన్‌స్పెక్టర్ వీణాద్రి ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. లెక్కింపులో భాగంగా రూ.5,13,368 సమకూరినట్టు ఆలయ ఈవో రాజేశ్వర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నాగిరెడ్డి, రవీందర్ శర్మ, దామోదర్ రెడ్డి, శ్రీహరి, నరేందర్ చారి, కొత్త కృష్ణయ్య పాల్గొన్నారు.
News April 8, 2025
మహబూబ్‌నగర్‌లో CONGRESS VS BRS

పాలమూరు పరిధి GDWL, NGKL, NRPT, WNP, MBNR జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?