News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

Similar News

News April 16, 2025

మహబూబ్‌నగర్: ‘ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టాలి’

image

పోలీసులు ప్రతి కేసును కూడా పారదర్శకంగా విచారణ చేపట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సర్కిళ్ల  వారీగా నమోదైన నేరాల విషయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష శాతాన్ని పెంచేందుకు పగడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. విచారణ జరగకుండా నిలిచిపోయిన కేసుల గురించి ఎస్పీ ఆరా తీసి కారణాలు అడిగి తెలుసుకున్నారు.

News April 16, 2025

MBNR: ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

image

ఉచిత కోచింగ్ సెంటర్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అంబేడ్కర్ కళాభవన్‌లో తన సొంత నిధులతో నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో HYDకు దీటుగా కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు. కోచింగ్‌కు వచ్చే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి మంచి స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తామన్నారు.

News April 16, 2025

నాగర్‌కర్నూల్: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!