News September 21, 2024

మహాకవి గురజాడ జయంతి నేడు

image

నవయుగ వైతాళికుడు, మహాకవిగా పేరు గాంచిన గురజాడ వెంకట అప్పారావు జయంతి విజయనగరంలో శనివారం జరగనుంది. 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా సర్వసిద్ధి రాయవరంలో ఆయన జన్మించారు. తండ్రి వెంకట రామదాసు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా పనిచేసే సమయంలో అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తండ్రి చనిపోయిన తరువాత విజయనగరం వచ్చి ఉన్నత విద్యను పూర్తి చేశారు. 20వ శతాబ్దంలో వ్యవహారిక భాషోద్యమంలో ఆయన పోరాడారు. SHARE IT..

Similar News

News September 21, 2024

VZM: రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ డీఐజీగా నాగలక్ష్మి

image

రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ డీఐజీగా ఎ.నాగలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె కాకినాడ నుంచి విజయనగరం బదిలీపై వచ్చారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజిస్ట్రార్‌గా పని చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని రిజిస్ట్రార్‌గా కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.

News September 21, 2024

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరట

image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది.

News September 21, 2024

VZM: ‘ఈనెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం’

image

ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ను శుక్రవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.