News May 21, 2024

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వీసీగా నవీన్ విఠల్‌

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ అధికారి నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది. MGUలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుత వీసీ గోపాల్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ వీసీగా నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది.

Similar News

News November 17, 2024

నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి  

image

నల్గొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన ప్రేమ్ – సునీతల కుమారుడు ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.

News November 17, 2024

నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి  

image

నల్లగొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన మెండే ప్రేమ్ – సునీతల కుమారుడు మెండే ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.

News November 17, 2024

NLG: నెలాఖరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె SLBC కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని తనిఖీ చేశారు. టీజీ ఎస్ఎం ఐడీసీ చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల పరిస్థితిని వివరించారు.