News January 25, 2025
మహానందిలో 1.20లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతాం: ఈవో
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది 1,10,000 లడ్డూ ప్రసాదాలు విక్రయించామని మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాలు సరిపడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం 1,20,000 లడ్డూలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలు విక్రయిస్తామన్నారు.
Similar News
News January 27, 2025
తాళ్లరేవు: చనిపోయి మరో ఇద్దరికి చూపునిచ్చిన మహిళ
ప్రముఖ దినపత్రికలో తాళ్లరేవు మండల విలేకరిగా వూడా వెంకటరమణ పనిచేస్తున్నారు. ఆయన సతీమణి హేమవతి(45) ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు వెంకటరమణ తన శ్రీమతి నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానమిచ్చారు. చనిపోయి ఆమె ఇద్దరికి చూపునిచ్చిందని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అభినందించారు. సతీ వియోగంతో బాధపడుతున్న విలేకరి వెంకటరమణను తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించారు.
News January 27, 2025
శ్రీ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు సోమవారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
News January 27, 2025
కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నల్గొండ వాసులు
కిడ్నీ రాకెట్ ఘటనలో నల్గొండ పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో అరెస్టైన వారిలో నల్గొండకు చెందిన నలుగురు మెడికల్ అసిస్టెంట్లు ఉండడం చర్చనీయాంశం అయ్యింది. NLGకు చెందిన రమావత్ రవి, సపావత్ హరీశ్, సపావత్ రవీందర్, పొదిల సాయి అరెస్టైన వారిలో ఉన్నారు. కాగా.. 2016లో ఈ తరహా ఘటన నల్గొండలో జరగ్గా.. ఇప్పుడు కూడా నల్గొండ వాసులు ఉండడం నివ్వెర పరుస్తోంది.