News February 25, 2025

మహాశివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రముఖ శైవక్షేత్రాలు వద్ద నిర్వహించే తిరునాళ్ల, రథోత్సవాలు వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి భద్రతా, ట్రాఫిక్ సమస్యలు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 25, 2025

మహిళలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్: ఎస్పీ

image

మహిళలకు అండగా “సఖి వన్ స్టాప్ సెంటర్” ఉంటుందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జీజీహెచ్ ఆవరణలో ఉన్న”సఖి వన్ స్టాప్ సెంటర్”ను మంగళవారం ఎస్పీ సందర్శించారు. ఈ సెంటర్‌లోని కేంద్ర నిర్వాహణ గది, పోలీస్ సలహాదారు గది, రెసెప్షన్, తాత్కాలిక వసతి కౌన్సిలింగ్ రూమ్‌లను ఎస్పీ తనిఖీ చేశారు.

News February 25, 2025

ప్రకాశం: ‘బుధవారం కూడా బిల్లులు చెల్లించవచ్చు’

image

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకొనే కేంద్రాలు 26వ తేదీ బుధవారం కూడా పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం శివరాత్రి రోజు కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే,ఆన్లైన్ లో బిల్లులు చెల్లించవచ్చు అని పేర్కొన్నారు.

News February 25, 2025

ఒంగోలు: ‘రీ సర్వేపై ప్రత్యేక దృష్టి సారించాలి’ 

image

రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ భూములన్నింటికీ పూర్తిస్థాయిలో గుర్తించటానికి రీ సర్వే చేయాలని జయలక్ష్మి ఆదేశించారు. రీ సర్వే చేస్తున్న సిబ్బంది సకాలంలో హాజరయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

error: Content is protected !!