News March 9, 2025
మహిళల ప్రగతితోనే సమాజ అభివృద్ధి: కలెక్టర్

మహిళలు ఉన్నత చదువులు చదివి, ఆర్థిక ప్రగతి సాధిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం, గుర్తింపు వస్తాయన్నారు.
Similar News
News March 10, 2025
KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.
News March 10, 2025
భారత్ విక్టరీపై కేంద్రమంత్రి బండి ట్వీట్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమిండియా..అన్ స్టాపేబుల్, అన్ బీటేబుల్, అన్ ఫర్గటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ద మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్‌గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
News March 9, 2025
కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధుల మంజూరు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.