News March 7, 2025
మహిళలకు హక్కులతో పాటు చట్టాలు: కలెక్టర్

జగిత్యాల: మహిళలకు సమాన హక్కులతో పాటు ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం కల్పిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్ సమావేశం మందిరంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లతా అన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 7, 2025
వేంపల్లె: ఉపాధ్యాయుడిపై మహిళా టీచర్లు ఫిర్యాదు

వేంపల్లె పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా టీచర్లపై పీజీటీ ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డి తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ కాళ్లతో తన్నినట్లు మహిళా టీచర్లు సునీత, అంజలి పేర్కొంటున్నారు. దీనిపై శుక్రవారం వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో గుర్నాథ్ రెడ్డిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 7, 2025
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ ఢిల్లీ బయల్దేరారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రేపు మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అనంతరం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు.
News March 7, 2025
కృష్ణా: పేర్ని నానికి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పలుమార్లు టీడీపీ నేతలు త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం ఆసక్తికి తెరలేపింది.