News April 4, 2025
మహిళలపై అఘాయిత్యాలు.. CM ఏంచేస్తున్నారు: RSP

శాంతి భద్రతలు కాపాడడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మేడ్చల్ MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం, సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్వయంగా సీఎం హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఇన్ని అఘాయిత్యాలు జరగటం ఏంటని ప్రశ్నించారు.
Similar News
News April 18, 2025
18th Anniversary: IPL స్పెషల్ పోస్టర్

ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభమై నేటితో 18 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా IPL X హ్యాండిల్ స్పెషల్ ట్వీట్ చేసింది. ‘కలలు నిజమయ్యాయి.. మనసులు ఉప్పొంగాయి.. కేరింతలు మార్మోగాయి’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్ చేసింది. ‘18 ఏళ్ల IPL జర్నీపై ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పండి?’ అని ఫ్యాన్స్‌ను కోరింది. COMMENT
News April 18, 2025
‘ఫ్రెంచ్ ఓపెన్’లో నాదల్‌కు సన్మానం

వచ్చే నెల 25 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఆరోజున తమ దేశపు ఆటగాడు, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌కు సన్మానం చేయాలని నిర్ణయించినట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు గిల్లెస్ మోరెటాన్ ప్రకటించారు. ‘రోలాండ్ గారోస్‌లో నాదల్‌కు మరెవరూ సాటిలేరు. ఇక్కడ ఆయన 14 టైటిళ్లు గెలిచారు. ఈ ఏడాది టోర్నమెంట్ ఆడకపోయినా ఆయన మాతో ఉంటారు. ఫ్రెంచ్ ఓపెన్‌కు రఫా ఓ గొప్ప రాయబారి’ అని ఆయన తెలిపారు.
News April 18, 2025
అనకాపల్లి: చెట్టుపై నుంచి పడి సచివాలయ ఉద్యోగి మృతి

మాకవరపాలెం మండలం జి.వెంకటాపురం సచివాలయంలో ఉద్యానవన సహాయకుడిగా పనిచేస్తున్న రాజేశ్ మృతి చెందినట్టు ఎంపీడీవో సీతామాలక్ష్మి తెలిపారు. కోటవురట్ల మండలం అన్నవరం అతని స్వగ్రామమని పేర్కొన్నారు. అయితే శుక్రవారం అదే గ్రామంలో చెట్టుపై నుంచి పడి మృతి చెందినట్లు వెల్లడించారు. కోటవురట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.