News March 5, 2025

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: SP

image

జిల్లా కేంద్రంలో మార్చి 8న చేపట్టే మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను SP వకుల్ జిందాల్ ఆదేశించారు. స్థానిక మహిళ పీఎస్‌ను బుధవారం సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషను వద్ద మార్చి 8న నిర్వహించనున్న మహిళా దినోత్సవ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News March 6, 2025

VZM: మొత్తం 308 దరఖాస్తులు.. మరికాసేపట్లో ప్రారంభం!

image

విజయనగరం జిల్లాలో కళ్లు గీత, సొండి, శెట్టి బలిజ, శ్రీ సైన, యాత, సెగిడి సామాజిక వర్గాలకు 16 మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. దీని కోసం ఆయా సామాజిక వర్గాల నుంచి మొత్తం 308 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది.గత నెల 10న లాటరీ తీయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచింది. అదృష్టవంతులెవరో మరికాసేపట్లో తేలిపోనుంది.

News March 6, 2025

అవసరమైతే పోలీసులను వినియోగించుకుంటాం: కలెక్టర్

image

జిల్లాలో బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్మూలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క‌లెక్ట‌ర్ అంబేద్కర్ అన్నారు. వెట్టి చాకిరీ, మాన‌వ అక్ర‌మ ర‌వాణాల‌పై ముద్రించిన పోస్ట‌ర్ల‌ను తన ఛాంబర్‌లో బుధవారం ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల కార్మికుల‌ను గుర్తించేందుకు వివిధ శాఖ‌లు సంయుక్తంగా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే దీనికోసం పోలీసులను కూడా వినియోగించుకుంటామ‌న్నారు.

News March 6, 2025

VZM: మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత

image

అప్పటి సతివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత పొట్నూరు సూర్యనారాయణ సతీమణి కనకమ్మ బుధవారం కన్నుముశారు. ఆమె గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పాలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ప్రజల సందర్శనార్థం పార్ధివదేహాన్ని పాలవలసలోని తన నివాసంలో అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

error: Content is protected !!