News February 3, 2025

మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి 

image

చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Similar News

News February 3, 2025

ప్రభాస్ ‘కన్నప్ప’ లుక్‌పై ట్రోల్స్

image

కన్పప్పలో ప్రభాస్ లుక్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ లుక్ ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో నాగార్జున లుక్‌ను పోలి ఉందని పలువురు పోస్టులు చేస్తున్నారు. విగ్ సెట్ అవలేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా లుక్‌పై ఫోకస్ చేయాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ లుక్‌పై మీ కామెంట్?

News February 3, 2025

గద్వాల ప్రజావాణిలో 28 దరఖాస్తులు.!

image

గద్వాల జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.

News February 3, 2025

టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

image

జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు వచ్చే నెలలో నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్‌ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గతేడాది 95.2% ఉత్తీర్ణత నమోదయిందని, ఈ ఏడాది 100శాతం నమోదు కావాలన్నారు.