News March 17, 2025
మాకవరపాలెం: బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

మాకవరపాలెం మండలం చామంతిపురంలో ఒక యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్(17) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేశారు.
Similar News
News March 17, 2025
పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.
News March 17, 2025
ప్రభుత్వ పథకాలపై అధికారులతో మేడ్చల్ కలెక్టర్ సమీక్ష

జిల్లాలోని శాఖల వారీగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంత శాతం లబ్ధి చేకూరుతుందనే జాబితాలను మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం పరిశీలించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్‌లో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు జిల్లాకు మంగళవారం రానున్న సందర్భంగా జిల్లా అధికారులతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంల లబ్ధి చేకూరుతుందని శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
News March 17, 2025
జూలపల్లి: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుల్తానాబాద్ మైదానంలో పెద్దపల్లి జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జూలపల్లి కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ తేలుకుంట విద్యార్థులు జి.మణిక్రాంత్, సాన్వి శ్రీ విద్యార్థులు 100mts, 400mts పరుగుపందెంలో పాల్గొని హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ, హెచ్ఎం, అభినందించారు.