News June 13, 2024

మాకు ఉద్యోగ భద్రత కల్పించండి: రామచంద్రరావు 

image

ప్రభుత్వ మద్యం దుకాణం సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. బెవరేజెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రామచంద్రరావు విజయవాడలో గురువారం మంత్రి జనార్దన్‌రెడ్డి,, శ్రీనివాసరావుని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. వైన్ షాప్‌లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, జీతభత్యలు ఎవరు చెల్లిస్తున్నారంటూ వాకబు చేశారు. అనంతరం ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. 

Similar News

News October 2, 2024

విజయనగరం ఉత్సవాల భద్రత ఏర్పాట్లపై సమీక్ష

image

జిల్లాలో ఈనెల 13న నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పైడిమాంబ తొలేళ్ళు, సిరిమానోత్సవంకు చేపట్టే భద్రత, బందోబస్తు ఏర్పాట్లుపై ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. శాంతియుతంగా నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News October 2, 2024

VZM: 2019కి ముందు ఎన్ని మద్యం షాపులు ఉండేవి అంటే..?

image

వైసీపీ ప్రభుత్వం రాక ముందు టీడీపీ ప్రభుత్వంలో చివరిగా 2017 జూలైలో ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. అప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో 210 షాపులకు టెండర్లు పిలవగా 3,636 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా అప్లికేషను ఫీజు కింద ప్రభుత్వానికి రూ. 21 కోట్లు ఆదాయం వచ్చింది. అప్లికేషను ఫీజు కింద జనాభాను బట్టి రూ. 55 వేలు నుంచి 75 వేల వరకు నిర్ణయించారు. తాజాగా జిల్లాలో 153 షాపులకు టెండర్లు పిలిచారు.

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.