News March 26, 2024
మాచవరం పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి

విజయవాడ గుణదల విజయనగర్ కాలనీలో మంగళవారం ఉదయం ఓ అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకుపోయేందుకు వచ్చానంటూ హల్ చల్ చేశాడు. స్పందించిన స్థానిక ప్రజలు అతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మాచవరం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 17, 2025
కృష్ణా: ప్రజా సమస్యలు పరిష్కరించండి- ఎస్పీ

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ గంగాధర రావు పాల్గొని 44 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
News March 17, 2025
కృష్ణా: జిల్లాలో పదో తరగతి పరీక్షకు 286 మంది గైర్హాజరు

పదవ తరగతి పరీక్షలు కృష్ణాజిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని డీఈఓ రామారావు తెలిపారు. తొలి రోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 21,162 మంది విద్యార్థులకు 20,876 మంది హాజరయ్యారన్నారు. 286 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 4, DLO అధికారులు 2, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ 2 కేంద్రాలను పరిశీలించారన్నారు.
News March 17, 2025
కృష్ణా: ‘టెన్త్ పరీక్షలకు యూనిఫామ్ అనుమతి లేదు’

పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ అనుమతి లేదని (గవర్నమెంట్ ఎగ్జామ్స్) అసిస్టెంట్ కమిషనర్ ఎమ్ డేవిడ్ రాజు తెలిపారు. సోమవారం స్వతంత్ర పురం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఘటనపై యూనిఫామ్ అనుమతి ఉందా, లేదా అన్న విషయంపై (ఎమ్ డేవిడ్ రాజును పాత్రికేయులు వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షా సమయంలో యూనిఫామ్ అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.