News February 7, 2025

మాచవరం: యువతిపై లైంగిక దాడి.. కేసు నమోదు

image

మాచవరంలో ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన నల్లమేకల వెంకటేశ్ అనే వ్యక్తి లైంగిక దాడి చేశారని బాధితురాలు గురువారం మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్ అనే యువకుడు తనపై లైంగిక దాడి చేశాడని, తాను కేకలు వేయడంతో పారిపోయాడని, యువతి బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. 

Similar News

News February 7, 2025

ఫొటోల మార్ఫింగ్ కేసు.. విచారణకు హాజరైన RGV

image

AP: కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులివ్వడంతో ఒంగోలు రూరల్ పీఎస్‌లో ఇవాళ విచారణకు హాజరయ్యారు.

News February 7, 2025

వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

image

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.

News February 7, 2025

విజయవాడలో భారీ దొంగతనం

image

విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్‌ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ.2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. 

error: Content is protected !!