News January 23, 2025
మాచవరం: సరస్వతి భూముల వివాదం ఇదే
పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కి భూములు కేటాయించారు. వారికి కేటాయించిన భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. గత నవంబరులో ఈ వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఇందులో భాగంగా వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.
Similar News
News February 5, 2025
తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి
రైలు నుంచి జారి పడి గాయాలపాలైన ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చీరాలకు చెందిన భాస్కర్(48) నిడుబ్రోలులోని రైతుబజార్‌లో వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రైలులో ప్రయాణిస్తూ తెనాలి స్టేషన్‌లో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వైద్యశాలకు పంపగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 5, 2025
బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు: డీఎస్పీ
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ తాడేపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సీతానగరం, మహానాడు వరకు నడుచుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
News February 4, 2025
GNT: భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
ఉమ్మగి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. కొన్ని రోజులుగా భార్య నవ్యశ్రీని విడిచిపెట్టి తప్పించుకు తిరుగుతున్న భర్త వాసు, ప్రియురాలు గాయత్రితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త, ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. నవ్యశ్రీ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.