News January 2, 2025

మాచారెడ్డి: రెసిడెన్షియల్ కోసం ఫేక్ ఆధార్..

image

రెసిడెన్షియల్ కోసం మీసేవ నిర్వాహకుడు డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసిన ఘటన మాచారెడ్డి మండలం ఘన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన ముహమ్మద్ షరీఫ్ ఫిలిప్పీన్ దేశానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం మీసేవ నిర్వాహకుడి సాయంతో డూప్లికేట్ ఆధార్ తయారు చేశారు. భార్యాభర్తల ఆధార్ నంబర్ సేమ్ ఉండడంతో RI రమేశ్ PSలో ఫిర్యాదు చేశారు.

Similar News

News January 7, 2025

నేడు కామారెడ్డికి మంత్రి జూపల్లి

image

నేడు కామారెడ్డిలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

News January 6, 2025

NZB: సినిమా ట్రైలర్ రిలీజ్.. ట్రాఫిక్ కష్టాలు

image

నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం రోడ్లు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాత కలెక్టరేట్ వద్ద ఈవెంట్ నిర్వహించగా పోలీసులు కోర్టు చౌరస్తా నుంచి సీపీ క్యాంపు ఆఫీస్ మీదుగా బస్ స్టాండ్ వైపుకు వెళ్లే రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

News January 6, 2025

NZB: ఉమ్మడి జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కొంత పెరిగి చలి తీవ్రత కాస్త తగ్గింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా గాంధారి 10.0, జుక్కల్ 10.7, రామలక్ష్మణపల్లి 10.9, డోంగ్లి 11.7, లింగంపేట, వేల్పుగొండ 11.9 నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ సౌత్ 12.9, మెండోరా 13.0, వలిపూర్ 13.2,ఎర్గట్ల 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.