News April 13, 2025
మాజీ మంత్రి మనవడికి 444 మార్కులు

ఇంటర్ ఫలితాల్లో మాజీ మంత్రి నారాయణస్వామి మనవడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి తనయుడు భువన తేజ సత్తా చాటాడు. MPC విభాగం మొదటి సంవత్సరంలో ఆయన 444 స్కోర్ చేశాడు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News April 15, 2025
చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన ఎంపీ

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మంగళవారం కలిశారు. పలు అంశాలపై సమీక్షించారు. ప్రజా సంక్షేమం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఎంపీ సూచించారు.
News April 15, 2025
చిత్తూరు: కిలో 7 రూపాయలే..!

మామిడి సాగుకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల మామిడి పండుతుంది. కానీ రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఓవైపు పూత, దిగుబడి సమస్య వేధిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతును కకావికలం చేస్తున్నాయి. నిన్న జిల్లాలో వీచిన గాలులకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వాటిని మండీలకు తరలిస్తే కేజీకి రూ.7 నుంచి రూ.10 మించి ధర లభించలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
News April 15, 2025
చిత్తూరు TDP నేత ఇంట్లో విషాదం

TDP నేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జీడీనెల్లూరు(M) జూపల్లిలో TDP నేత గోపాల్ రెడ్డి ఉండగా.. భార్య మీనా పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. తమిళనాడులోని గుడికి సోమవారం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం మీనా పూలమాలలు తీసుకుని బయల్దేరారు. రాత్రి గోపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. ‘దేవుడికి వేయాల్సిన మాల నీపై వేయాల్సి వచ్చింది’ అంటూ మీనా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.