News October 31, 2024

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు

image

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. బీఆర్‌ఎస్ కార్యకర్త భాస్కర్ సోషల్ మీడియోలో సీఎం రేవంత్‌పై అనుచిత వాఖ్యలతో పోస్టులు పెట్టాడని, బుధవారం అతడిని అరెస్టు చేసి తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ శ్రీనివాస్ గౌడ్ పోలీస్ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. దీంతో తమ విధులకు ఆయన ఆటంకం కలిగించారని, తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

Similar News

News November 1, 2024

RS ప్రవీణ్ కుమార్ సెటైరికల్ ట్వీట్!

image

జన్వాడ ఫాంహౌస్ కేసు నేపథ్యంలో BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘దీపావళికి దావత్ ప్లాన్ ఉంటే బ్రీత్ అనలైజర్లు, డ్రగ్ టూల్ కిట్లు దగ్గర ఉంచుకోండి. తాగాలనుకుంటే మందు బాటిళ్ల బిల్లులు ఉంచుకోండి. మందు పార్టీకి పర్మిషన్ ఉండాలని మంత్రులు అంటున్నారు కనుక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. గిట్టనివాళ్లు రేవ్ పార్టీ అనే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండండి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News November 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

➤ప్రారంభమైన కురుమూర్తి ఉత్సవాలు
➤ఘనంగా దీపావళి సంబరాలు
➤Way2Newsతో దీపావళి ప్రేమికుడు
➤దీపావళి EFFECT..మార్కెట్లో కొనుగోళ్ల కోలాహలం
➤గండీడ్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
➤కొత్తకోట: వేరుశెనగ యంత్రంలో పడి మహిళ మృతి
➤వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి:VBSF
➤PM యశస్వి ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి: DEOలు
➤జూరాల కెనాల్‌లో పడిన వ్యక్తిని కాపాడిన స్థానికులు

News October 31, 2024

MBNR: సర్వేకు సర్వం సిద్ధం.. 50 ప్రశ్నలపై ఫోకస్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠంగా తలపెట్టిన సకుటుంబ సర్వేకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, జిల్లా, మండల కార్యాలయాల్లో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాల్లో ఎన్యుమరేటర్లకు అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై అవగాహన కల్పించారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధిపై సర్వే జరగనుంది.