News August 22, 2024
మాతృ మరణాలు జరగకుండా పటిష్ట చర్యలు: కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి జిల్లాలో ప్రసూతి మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గత ఆరు నెలలుగా జరిగిన మాతృ మరణాలపై ఆరా తీశారు. తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ఆమె సమీక్షించారు. రక్తపోటు, రక్తహీనత వంటి సాధారణ పరీక్షలతో పాటు డెలివరీకి వచ్చిన ప్రతి గర్భిణీకి జ్వర పరీక్షలు నిర్వహించాలన్నారు.
Similar News
News January 20, 2025
విశాఖ: రాత పరీక్షకు 272 మంది ఎంపిక
కైలాసగిరి మైదానంలో APSLRB ఆధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులకు గానూ 361మంది హాజరయ్యారని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. వీరిలో 272 మంది అభ్యర్థులు తదుపరి జరగనున్న రాత పరీక్షకు ఎంపికయినట్లు వెల్లడించారు. నియామక ప్రక్రియ ప్రణాళిక బద్దంగా జరుగుతుందన్నారు.
News January 20, 2025
ఆనందపురం: లంకె బిందెల పేరుతో రూ.28 లక్షలు స్వాహా
ఆనందపురం మండలం బీపీ కళ్లాలకు చెందిన నలుగురు వద్ద నుంచి లంకె బిందెలు పేరుతో ముగ్గురు వ్యక్తులు రూ.28 లక్షలు కాజేశారు. దీనిపై ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. తన దగ్గర బంగారు నిధి ఉందని పూజలు చేయడానికి రూ.30 లక్షలు అవుతుందని నకిలీ స్వామీజీ నమ్మించాడు. బాధితులు దఫదఫాలుగా నిందితులకు రూ.28 లక్షలు ఇచ్చారు. ఈనెల 2న బాధితులకు రెండు బిందెలు ఇచ్చి వారు వెళ్లిపోయారు. తర్వాత చూడగా వాటిలో ఏమి లేవు.
News January 20, 2025
ఎండాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఎండాడ సాయిరాం పనోరమ హిల్స్ వద్ద నూతనంగా నిర్మాణంలో ఉన్న భవంతులలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్యంగా ఉండి మద్యం తాగి మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.