News January 10, 2025
మాతృ శిశు మరణాలు సంభవిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
మాతృ శిశు మరణాలు సంభవిస్తే, సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. గత 5 నెలల్లో జిల్లాలో జరిగిన మాతృ, శిశు మరణాలపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఎంపీసీడీఎస్సార్ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. మొత్తం 10 మాతృ మరణాలు, 6 శిశు మరణాలపై కేసుల వారీగా వివరాలను తెలుసుకున్నారు. మరణాలకు కారణాలు, వారికి అందించిన చికిత్స, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు.
Similar News
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’లో విజయనగరం కలెక్టర్‌గా బ్రహ్మానందం..!
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్‌గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్‌లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.
News January 9, 2025
జంప్‌డ్ డిపాజిట్ స్కామ్‌తో జాగ్రత్త: SP వకుల్ జిందాల్
నేరగాళ్లు జంప్‌డ్ డిపాజిట్ స్కామ్‌కు పాల్పడుతున్నారు. అకౌంట్‌లో నగదు వేస్తున్నారు. మెసేజ్ చూసి UPIతో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే డబ్బులు దోచేస్తున్నారు. ఈ స్కామ్ పట్ల విజయనగరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. అకౌంట్‌లో డబ్బులు పడినట్లు మెసేజ్ వస్తే 30 ని. తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని, ఫస్ట్ టైమ్ రాంగ్ UPI పిన్ ఎంటర్ చేస్తే స్కామర్ రిక్వస్ట్ క్యాన్సిల్ అవుతుందన్నారు.
News January 9, 2025
VZM: ‘గుంతలు లేని రహదారులుగా 296 కిలోమీటర్లు’
పల్లె పండుగలో భాగంగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా విజయనగరం జిల్లాలో చేపట్టిన రోడ్ల మరమ్మతు పనులు 296 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. రోడ్ల మరమ్మతు పనులపై అధికారులతో కలెక్టర్ తమ ఛాంబర్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 884 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులకు 176 పనులను ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు.