News December 28, 2024

మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: జస్టీస్ ఎన్వి రమణ

image

సమాజం సంతోషంగా ఉంటే మనం కూడా ఆనందమయ జీవితాన్ని గడుపుతామని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమావేశం శనివారం డైక్ మన్ హాల్లో సంఘం డైరెక్టర్ జివిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ పాల్గొని మాట్లాడుతూ మనలోని భావాలను మాతృభాష ద్వారా వ్యక్తపరిస్తే అందులో కనిపించే భావోద్వేగం సరైన క్రమంలో చెప్పగలుగుతామన్నారు.

Similar News

News January 1, 2025

పల్నాడు: కొత్త సంవత్సరం వేళ కుటుంబంలో తీవ్ర విషాదం

image

నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమారుడికి కేక్ కొనిచ్చేందుకు తీసుకెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద విషాదాంతమిది. గ్రామానికి చెందిన దుర్గారావు బైక్‌పై కుమారుడితో కలిసి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో బాలుడు కార్తీక్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 1, 2025

వివాహిత హత్య కేసులో నలుగురు అరెస్ట్

image

వివాహిత షేక్ మల్లిక(29) హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వివరాల ప్రకారం.. పెదకాకాని(M) నంబూరికి చెందిన మల్లికకు అక్బర్‌తో 15ఏళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత ఆమె భర్తను, పిల్లలను వదిలేసి ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెహమాన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మరో యువకుడితో కూడా సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో రెహమాన్ ఆమెను చంపించాడు.

News January 1, 2025

వినుకొండలో న్యూఇయర్ వేడుకలు.. PIC OF THE DAY

image

వినుకొండలో విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం రంగవల్లిని అందంగా అలంకరించారు. లైట్లు వెలిగించి వాటి చుట్టూ క్యాండిల్స్ వెలిగించారు. అనంతరం రంగవల్లుల చుట్టూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. దీంతో రంగవల్లి చుట్టూ ఉన్న చిన్నారుల ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.