News March 21, 2025
మాదకద్రవ్యాలు అరికట్టేందుకు సిద్ధం: సీపీ

మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్&గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్స్ అబ్యూస్‌పై పోలీస్ సిబ్బంది అధికారులకు సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు యువతను పట్టి పీడిస్తున్నాయన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు.
Similar News
News March 23, 2025
ప్రజలు కాదు.. పొలిటీషియన్లే కులతత్వవాదులు: గడ్కరీ

ప్రజలు కులతత్వవాదులు కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడతారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటుతనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్‌గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపైనా పోటీ ఉందని గడ్కరీ పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.
News March 23, 2025
జడ్చర్ల: చికిత్స పొందుతూ.. యువకుడి మృతి

చికిత్స పొందుతూ.. యువకుడు మృతి చెందిన సంఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన రవీంద్ర (26) శుక్రవారం కుటుంబ సభ్యులతో భూతగాదాలతో గొడవ పడి పారాసెటమాల్ మాత్రలను వేసుకున్నాడు. అనంతరం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో రవీంద్ర మరణించాడని, సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఇజాజొద్దీన్ తెలిపారు.
News March 23, 2025
అయిజ: ధాన్యం బస్తాతో శ్రీశైలం పాదయాత్ర

కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ నుంచి బసవ అనే భక్తుడు తాను పండించిన తెల్లజొన్న ధాన్యం మల్లికార్జునస్వామికి ముడుపుగా ఇస్తానని మొక్కుబడి పెట్టుకున్నాడు. ఆ మేరకు అతడికి పంట బాగా పండటంతో 50 కేజీల జొన్నల బస్తాను భుజంపై పెట్టుకుని వారం కిందట శ్రీశైలం పాదయాత్ర ప్రారంభించాడు. శనివారం అయిజ మండలం వెంకటాపురం చేరుకున్నాడు. ధాన్యం బస్తా మోస్తూ శ్రీశైలం పాదయాత్ర చేయడం పట్ల నడిగడ్డ వాసులు అతడిని ప్రశంసించారు.