News March 31, 2025
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు వివరాలు.. ఆసుపాకకు చెందిన దివ్యాంగురాలు తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. శనివారం తల్లి బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో వెంకటేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 4, 2025
పింఛన్ కోసం వచ్చే మహిళను గర్భవతిని చేశాడు..!

పింఛన్ కోసం వచ్చిన చెవి, మూగ మహిళను ఓ వ్యక్తి గర్భవతిని చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. సుబ్లేడులో మినీ ఏటీఎం నిర్వహిస్తున్న కామళ్ల వీరవయ్య వద్దకు ఆయన బంధువైన మహిళ పింఛన్ కోసం వచ్చేది. ఈ క్రమంలో వీరయ్య అమెను నమ్మించి గర్భవతిని చేశాడు. విషయం తెలిసి బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరయ్యను రిమాండ్‌కు తరలించారు.
News April 4, 2025
అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్

అమ్మాయి పుడితే ఇంటిల్లిపాది పండగ చేసుకోవాలని, అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే ఆడపిల్లలు పుడతారని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కామేపల్లి(మం) కొత్త లింగాలలో ఉండేటి అమృత-సుధాకర్ దంపతులకు ఇటీవల ఆడపిల్ల పుట్టగా, కలెక్టర్ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పాప తల్లిదండ్రులతో పాటు అత్తా, మామలను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం తల్లిదండ్రులను సత్కరించారు.
News April 4, 2025
ధాన్యానికి రూ.500 బోనస్ చరిత్ర: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ప్రజలు మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతును రాజు చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో మంత్రి ధాన్యం కనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. దేశచరిత్రలోనే మొదటిసారిగా ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో నేతలు, అధికారులు పాల్గొన్నారు.