News March 28, 2025
మామిడికుదురు: పాము కాటుకు గురై యువతి మృతి

మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన కంచి శృతి (24) పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం 6.గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా చేతిపై పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News April 2, 2025
2 ఉద్యోగాలు సాధించిన వాంకిడి వాసి శివప్రసాద్

వాంకిడి మండలానికి చెందిన బెల్లాల రమేశ్, తార దంపతుల తనయుడు శివ ప్రసాద్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు. గత సంవత్సరం ఏపీజీబీలో జాబ్ చేస్తూ నిన్న వెలువడిన ఐబీపీఎస్ ఫలితాల్లో ఇండియన్ బ్యాంక్ క్లర్క్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు,గురువుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని శివప్రసాద్ తెలిపారు.
News April 2, 2025
నల్గొండ: రోడ్డుపై కారుతో స్టంట్స్.. యువకుడి అరెస్ట్

నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాల రోడ్డు పై షిఫ్ట్ డిజైర్ కార్‌తో స్టంట్స్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై వేగంగా స్టంట్స్ చేయడంతో ప్రజలు భయాందోనకు గురయ్యారు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ కారును పట్టుకునే ప్రయత్నం చేయగా సదరు యువకుడు కానిస్టేబుల్‌ను కారుతో భయపెట్టి పరారయ్యాడు. కాగా విషయం తెలుసుకున్న 2 టౌన్ పోలీసులు సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు.
News April 2, 2025
కేంద్ర స్పోర్ట్స్, యువజన వ్యవహారాల శాఖ మంత్రిని కలిసిన SU Vc

ఆచార్య రవికుమార్ రిజిస్ట్రార్, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌తో కేంద్ర స్పోర్ట్స్, యువజన వ్యవహారాలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ SU Vc ఆచార్య ఉమేశ్‌కుమార్ కలిశారు. ఈ సందర్భంగా SUకి ఖేలో ఇండియా పథకం కింద మంజూరు చేసిన నిధులు త్వరగా అందించాలని కోరారు. దీంతో విశ్వవిద్యాలయంలోని క్రీడలకు సంబంధించిన మల్టీపర్పస్ భవనాన్ని నిర్మించుకోవడానికి సరైన ఆర్థిక సహకారం లభిస్తుందన్నారు.